జీవితంలో ఏదీ ఓటమి కాదు: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వ్యాఖ్యలు

రిపోర్టర్: హరి స్థలం: చెన్నై

జీవితాన్ని గట్టిగా నమ్మాలని, శ్వాస ఉన్నంతవరకు ఏదీ ఓటమి కాదని కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా నవంబర్ ఆరో తేదీన విడుదల కానున్న తన లేటెస్ట్ సినిమా సీన్ ప్రమోషన్స్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. కేవలం కోరుకోవడంతో సరిపోదని, కలలు నిజం కావాలంటే గట్టి ప్రయత్నం ఉండాలని సూర్య స్పష్టం చేశారు. ఐదు వయసు దాటిన తర్వాత తనకు మనశ్శాంతి, మంచి ఆరోగ్యమే ముఖ్యమని ఆయన తెలిపారు.