కామాఖ్య ఆలయాన్ని దర్శించుకున్న ఉపాసన కొణిదెల

రిపోర్టర్: వెంకట్ స్థలం: అస్సాం

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల కుటుంబ సభ్యులతో కలిసి అస్సాంలోని గువాహటిలో ఉన్న ప్రసిద్ధ కామాఖ్య దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, 'న్యూ బిగినింగ్స్' అంటూ ఆధ్యాత్మిక సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆమె కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నారనే ఊహాగానాలు నెట్టింట వైరల్‌గా మారాయి.