సెప్టెంబరు 29 నుంచి సీఎం చంద్రబాబు వరుస పర్యటనలు
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 3 వరకు వరుస పర్యటనలు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా విజయవాడలో డీఓపీటీ కర్మయోగి మిషన్‌కు హాజరుకానున్నారు. అలాగే నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగే పల్లె పండగలో పాల్గొని, విజయవాడలో ఇళ్ల పట్టాలు అందజేస్తారు. అక్టోబరు 1న పింఛన్లు పంపిణీ చేయనున్నారు. కేంద్ర మంత్రితో కలిసి మదనపల్లెలో రాయలసీమ అంతర్జాతీయ ఉద్యాన హబ్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు.