ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు పద్మభూషణ్ ఇవ్వాలంటూ సమిక్ భట్టాచార్య డిమాండ్

రిపోర్టర్: రాజేష్ స్థలం: New Delhi

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దేశంలో సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో ఆయన కనబరిచిన ప్రతిభకు కనీసం పద్మభూషణ్ పురస్కారం దక్కాలని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఆయన సొంత పార్టీవారే పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.