పలాసలో ఉద్యోగ భద్రత కోరుతూ కాంట్రాక్టు సిబ్బంది నిరసన
రిపోర్టర్: Dinesh panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది, నర్సులు తమకు ఉద్యోగ మరియు ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ బ్లాక్ రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గురువారం జిల్లా జేఏసీ సభ్యులు ఆసుపత్రిని సందర్శించి కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి అభిప్రాయ సేకరణ ఫారాలను స్వీకరించారు. ఉద్యోగులందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని జేఏసీ సభ్యులు స్పష్టం చేశారు.