ఉద్యోగులకు భారీ ఊరట: రెండు డీఏల విడుదలకు కేబినెట్ ఆమోదం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

పెండింగ్లో ఉన్న రెండు డీఏలను వెంటనే విడుదల చేసేందుకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు మేలు జరగనుందని తెలిపారు. దీనివల్ల ఖజానాపై ఏటా రూ. 2,500 కోట్ల అదనపు భారం పడనుందని పేర్కొన్నారు.