భక్తిపారవశ్యంతో పులకించిన పలాస పెద్ద వీధి వినాయకుడు
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
పలాస పెద్ద వీధిలో బాబా యూత్ కమిటీ ఆధ్వర్యంలో అనంత పద్మనాభ స్వామి శయనించిన రూపంలో ఉన్న ప్రత్యేక గణనాధుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ అద్భుతమైన గణేశుని విగ్రహం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నేటి నుంచి వినాయక నవరాత్రులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితో ఈ భారీ విగ్రహాన్ని తయారు చేసేందుకు సుమారు నెల రోజుల సమయం పట్టిందని బాబా యూత్ కమిటీ నిర్వాహకులు తెలిపారు.