రాప్తాడు ఘటన: నిందితుడు హేమంత్ కుడికాలును తొలగించిన అనంతపురం వైద్యులు

రిపోర్టర్: వెంకట్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్ కుడికాలును వైద్యులు తొలగించారు. పోలీసుల కాల్పుల్ లో గాయపడి అనంతపురం జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న అతడి కాలు పూర్తిగా దెబ్బతినడంతో ఈ శస్త్రచికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే హత్యాయత్నం సహా పలు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసినట్లు అధికారులు వెల్లడించారు.