సోషల్ మీడియా మోజులో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు

రిపోర్టర్: కిరణ్ స్థలం: మహబూబ్ నగర్

సోషల్ మీడియా మోజులో పడి విద్యార్థులు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సూచించారు. అడ్డాకుల మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ప్రభుత్వం అందించిన షూస్, బ్యాగులను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్ రీల్స్కు బానిసలై భవిష్యత్తును పాడు చేసుకోవద్దన్నారు. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటూ చదువుపై దృష్టి పెట్టాలని తెలిపారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు తిమ్మాయపల్లి తండాకు వెంటనే బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.