భార్యాపిల్లలను వదిలేసి విడాకులు కోరితే చెల్లదు: కర్ణాటక హైకోర్టు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: కర్ణాటక

అనారోగ్యంతో ఉన్న చిన్నారిని, భార్యను పుట్టింట్లో వదిలేసి తిరిగి తీసుకెళ్లకుండా భర్త విడాకులు కోరడం చెల్లదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. భార్య తనను వదిలేసి వెళ్లిపోయిందంటూ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. బాధ్యతల నుంచి తప్పుకుని నిందలు వేసే వారికి ఈ తీర్పు హెచ్చరికలా నిలుస్తుందని ధర్మాసనం పేర్కొంది.