ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీలో రేషన్ బియ్యం గుర్తింపు

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లా వైరా సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవేపై అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొట్టి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. లారీలో రవాణా అవుతున్న బియ్యం బస్తాలపై ప్రభుత్వ లోగోలు ఉండటంతో అక్రమ రేషన్ బియ్యంగా పోలీసులు అనుమానిస్తున్నారు. పౌర సరఫరాల అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.