బాలిక అనుమానాస్పద మృతి కేసులో నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన్న ఎస్పీ

రిపోర్టర్: sujith reddy స్థలం: ఒంగోలు అర్బన్

ప్రకాశం జిల్లాలో ఆరేళ్ల బాలిక మృతి చెందిన ఘటనపై ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఒంగోలు జీజీహెచ్ మార్చురీలో మృతదేహాన్ని పరిశీలించి డాక్టర్లతో మాట్లాడారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితుడికి చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.