నారాయణవనం మండలంలో పూర్తిగా దెబ్బతిన్న గ్రామీణ తారు రోడ్లు
రిపోర్టర్: kishor Kumarr
స్థలం: నారాయణవనం
తిరుపతి జిల్లా నారాయణవనం మండలం అరణ్యం కండ్రిక పంచాయతీలోని వివిధ గ్రామాలకు వెళ్లే తారు రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. వర్షం కురిస్తే ఆ గుంతల్లో నీరు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై తక్షణమే స్పందించి రోడ్డును మరమ్మతు చేయించాలని స్థానిక గ్రామస్తులు సంబంధిత అధికారులను కోరారు.