మల్లారెడ్డి యూనివర్సిటీలో సినిమా ప్రమోషన్ ఈవెంట్: ఉన్నత విద్యామండలి సీరియస్
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
నిబంధనలకు విరుద్ధంగా తరగతులు రద్దు చేసి మల్లారెడ్డి యూనివర్సిటీలో సినిమా ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించడంపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఛైర్మన్ ఆచార్య వి. బాలకిష్టారెడ్డి తెలిపారు. కళాశాల యాజమాన్యానికి త్వరలోనే నోటీసులు జారీ చేసి వివరణ కోరతామని ఎస్ఎఫ్ఐ నేతలకు ఆయన స్పష్టం చేశారు. విద్యాసంస్థల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన శిక్షలు అమలు చేసేలా కొత్త బిల్లు తెస్తున్నట్లు పేర్కొన్నారు.