గంటి మోహనచంద్ర బాలయోగి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన దేవినేని ఉమా

రిపోర్టర్: శివ స్థలం: ఎన్టీఆర్

కోనసీమలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా మరియు తొలి దళిత లోక్సభ స్పీకర్గా దేశానికి ఆదర్శవంతమైన సేవలు అందించిన గంటి మోహనచంద్ర బాలయోగి జయంతి సందర్భంగా ఆయన స్మృతికి మాజీ మంత్రి, మైలవరం నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన తన సామాజిక మాధ్యమాల వేదికగా బాలయోగి సేవలను స్మరించుకుంటూ ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తూ ఈ సందేశాన్ని వెల్లడించారు.