మీరా రోడ్డులో మెట్రో బ్రిడ్జిపై నుంచి పడిన సిమెంట్ దిమ్మ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలోని మీరా రోడ్డు కాశీమిరా ప్రాంతంలో జరుగుతున్న మెట్రో పనుల సమయంలో భారీ సిమెంట్ దిమ్మ తలపై పడి షాదాబ్ అనే 23 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డు దాటుతూ ఫోన్ మాట్లాడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితుడు గంట పాటు రోడ్డుపైనే పడి ఉండగా, చివరకు ఆటోలో ఆసుపత్రికి తరలించారు. మెట్రో నిర్మాణ ప్రాంతంలో తగిన భద్రతా చర్యలు లేవంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.