రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేసేలా క్యాపిటల్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
ప్రాణాంతక క్యాన్సర్ మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స కోసం ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితిని నివారించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదేళ్ల సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసింది. రాష్ట్ర వైద్య రంగాన్ని పూర్తిగా బలోపేతం చేయడమే లక్ష్యంగా క్యాపిటల్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ 2026-2031ను రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. వివిధ విభాగాల అభివృద్ధి కోసం రూ.18,945 కోట్లకు పైగా నిధులను వెచ్చించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.