దేశంలో గుళ్లు గోపురాలకే నలభై ఎనిమిది శాతం పర్యటనలన్న గణాంకశాఖ

రిపోర్టర్: విజయ్ స్థలం: దిల్లీ

దేశంలో ప్రజలు చేసే పర్యటనల్లో నలభై ఎనిమిది శాతం గుళ్లు, గోపురాలకే ఉన్నట్లు కేంద్ర గణాంకశాఖ టూరిజం ఎక్స్‌పెండిచర్‌ సర్వే నివేదికలో వెల్లడించింది. గత ఏడాది కుటుంబాల చొప్పున చేసిన ఓవర్‌నైట్‌ ట్రిప్పులను ప్రాతిపదికగా చేసుకుని ఈ వివరాలను తెలిపింది. ఏపీలో అరై నాలుగు శాతం, తెలంగాణలో యాభై తొమ్మిది శాతం కుటుంబాలు ఓవర్‌నైట్‌ పర్యటనలు చేసినట్లు వెల్లడైంది. దేశీయ పర్యాటక రంగంలో ఉత్తర్‌ ప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది.