స్మార్ట్ రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం పంపిణీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రిపోర్టర్: రాజేష్
స్థలం: సూర్యాపేట
స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం సన్న బియ్యం పంపిణీ చేసి చరిత్ర సృష్టించిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలోని ఎస్కేఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించడంతో పాటు ధాన్యం పండించే రైతులకు క్వింటాలుకు ఐదు వందల రూపాయల బోనస్ అందిస్తున్నామని తెలిపారు.