గెడ్డలో దిగి గ్రామస్థుల నిరసన: వంతెన నిర్మించకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిక
రిపోర్టర్: విజయ్
స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా
అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయతీ చంపాపట్టి, జాకరవలస గ్రామస్థులు గెడ్డలో దిగి సామ బస్తాలను మోసుకుంటూ తీవ్ర నిరసన తెలిపారు. దశాబ్దాలు గడుస్తున్నా తమ కాలిబాట, వంతెన కష్టాలు తీరడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణానికి స్పష్టమైన హామీ ఇస్తేనే ఓట్లు వేయడానికి ముందుకొస్తామని, వైకాపా హయాంలో శిలాఫలాకం వేసి వదిలేశారని స్థానికులు వాపోయారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు.