మెగాస్టార్ అభిమానులకు తీపి కబురు: శివరాత్రికి విశ్వంభర సినిమా విడుదల

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

అగ్ర కథానాయకుడు చిరంజీవి నటించిన విశ్వంభర సినిమాను వచ్చే ఏడాది శివరాత్రి కానుకగా విడుదల చేయాలని యూవీ క్రియేషన్స్ భావిస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. వీఎఫ్ ఎక్స్ పనుల కారణంగా గతంలో వాయిదా పడిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉందని సినీ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.