రాజ్-డీకే దర్శకత్వంలో మహేష్ బాబు కొత్త సినిమా?

రిపోర్టర్: సురేష్ స్థలం: తెలంగాణ

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం తర్వాత, 'ది ఫ్యామిలీ మ్యాన్' మేకర్స్ రాజ్, డీకే దర్శకత్వంలో నటించనున్నట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఈ దర్శక ద్వయం మహేష్‌కు ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ వినిపించగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మహేష్ తదుపరి ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.