'పర్యాటక రంగానికి ప్రత్యేక ప్రణాళిక': కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం
రిపోర్టర్: RAVI BABU
స్థలం: వెదురుకుప్పం
చిత్తూరు జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన జిల్లా పర్యాటక మండలి సమావేశంలో పులిగుండు, అర్ధగిరి ఆలయాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు వంటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. భూమిరెడ్డిపల్లి, గంగినేని చెరువుల్లో బోటింగ్ సదుపాయాలను అభివృద్ధి చేయాలని, మొదటి దశలో ముఖ్యమైన ప్రాంతాలపై దృష్టి పెట్టాలని తెలిపారు.