అక్రమ టపాసుల దుకాణాలపై ఉక్కుపాదం మోపనున్న అగ్నిమాపక శాఖ

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండల పరిధిలోని అన్ని గ్రామాల లో టపాసుల దుకాణాల ఏర్పాటుకు కచ్చితంగా అనుమతులు తీసుకోవాలని జన్నారం అగ్నిమాపక కేంద్రం అధికారి శ్రీనివాస్ కోరారు. దీపావళి పండుగ సందర్భంగా మండలంలో దుకాణాల ఏర్పాటుకు ఆన్లైన్ లో దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇప్పటివరకు కేవలం మూడు దుకాణాల ఏర్పాటుకు మాత్రమే అనుమతులు మంజూరు చేసినట్లు అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ వెల్లడించారు.