షాకింగ్ ఘటన: సిగరెట్ వాడకం వల్ల స్వరం మారిపోయిందన్న సెలెనా గోమెజ్

రిపోర్టర్: గోపి స్థలం: Los Angeles

నికోటిన్ వాడకం వల్ల తన గొంతు స్వరం పూర్తిగా మారిపోయిందని ప్రముఖ పాప్ గాయని, నటి సెలెనా గోమెజ్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను ఎక్కువగా ఈ-సిగరెట్లు, నికోటిన్ ఉత్పత్తులు వాడానని, దానివల్ల వాయిస్ మారినట్లు గుర్తించి ఇటీవల ఆ వ్యసనాన్ని మానేశానని ఆమె వెల్లడించారు. నికోటిన్ వ్యసనం నుంచి బయటపడటం చాలా కష్టమని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని అందరూ హెచ్చరించుకోవాలని ఆమె కోరారు.