రాజాపేట సేవాదళ్ అధ్యక్షుడిగా నియామకం: ధ్రువీకరణ పత్రం అందుకున్న నగేష్
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలం తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులుగా ఎన్నికైన గొడిసెల నగేష్ కు సోమవారం గాంధీ భవన్ లో రాష్ట్ర అధ్యక్షులు జితేందర్ అధికారికంగా ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నగేష్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి సేవాదళ్ నాయకులు ఉత్సాహంగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.