భీమిలి-నర్సీపట్నం రోడ్డు విస్తరణ పనుల పరిశీలన: త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: భీమిలి
కూటమి ప్రభుత్వంలో రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానించే కీలకమైన భీమిలి నర్సీపట్నం రోడ్డు విస్తరణ పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రూ. 34 కోట్ల వ్యయంతో రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్లుగా మారుస్తున్నామని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు.