పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ కొత్త సినిమా: డివైన్ యాక్షన్ థ్రిల్లర్

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ సంస్కృతి మరియు పోతరాజు నేపథ్యంలో హీరో మంచు మనోజ్ కథానాయకుడిగా ఓ భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోందని చిత్రబృందం వెల్లడించింది. ఆర్పీ క్రియేషన్స్ పతాకంపై ఆర్పీ అక్షిత్ రెడ్డి, ఆర్ సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఏ శ్రీధర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటివరకు చూడని సరికొత్త అవతారంలో మనోజ్ కనిపించనున్నారని, త్వరలోనే టైటిల్ తో పాటు పూర్తి వివరాలు ప్రకటిస్తామని మేకర్స్ స్పష్టం చేశారు.