కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జైల్భరో సీపీఐ నేత
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
మోడీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ డిసెంబర్ రెండు, మూడు, నాలుగు తేదీల్లో జైల్భరో నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. ఖమ్మం గిరిప్రసాద్ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిత్యావసర ధరలను నియంత్రించాలని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపడతామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.