'విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తున్నారు': వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

అమరావతిలో విద్యుత్ సరఫరా, పంపిణీ, బిల్లింగ్ వ్యవస్థల ప్రైవేటీకరణకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం సీఆర్‌డీఏ ద్వారా టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. అస్మదీయుల జేబులు నింపడానికే దశలవారీగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనివల్ల జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) హెచ్చరించింది.