సింగరేణి కార్మికుల సమస్యలపై రామగుండంలో భారీ బహిరంగ సభ: హరీశ్ రావు

రిపోర్టర్: రమేష్ స్థలం: తెలంగాణ

సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ కార్మికుల వారసులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇరవై లక్షల ఆర్థిక సహాయం అందించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల పద్నాలుగో తేదీన రామగుండంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు హరీశ్ రావు వెల్లడించారు.