మున్సిపల్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన నెల్లూరు కమిషనర్

రిపోర్టర్: అశోక్ స్థలం: నెల్లూరు

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ మున్సిపల్ పాఠశాలలను ఆకస్మికంగా పరిశీలించారు. మూలపేట, పరమేశ్వరి నగర్, సంతపేట పాఠశాలల్లో విద్యార్థులతో మాట్లాడి మౌలిక వసతులు, భోజన సదుపాయాలపై ఆరా తీశారు. పాఠశాలల్లో అదనపు నిర్మాణాలు, క్రీడా మైదానాల అభివృద్ధి, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు పచ్చదనం పెంపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.