ముత్యాలమ్మ జాతరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: హుజూర్ నగర్
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో వైభవంగా జరుగుతున్న ముత్యాలమ్మ జాతరకు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. అనంతరం జాతరను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులను మంత్రి అభినందించారు. జాతర సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.