వైద్య రంగానికి పెద్దపీట: నిమ్స్, ఉస్మానియా పనుల వేగవంతానికి మంత్రి ఆదేశం

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా నిమ్స్ విస్తరణ మరియు గోషామహల్ ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సచివగాలయంలో జరిగిన సమీక్షలో నిమ్స్ పనులు ఎనుబది శాతం, ఉస్మానియా పనులు ఇరవై మూడు శాతం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.