ధరలు అదుపులోకి వచ్చేవరకు నిరంతర తనిఖీలు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ ఆదేశం

రిపోర్టర్: రమేష్ స్థలం: సూర్యాపేట

అధిక ధరలను అదుపులోకి తీసుకువచ్చే వరకు మార్కెట్లలో నిరంతరం తనిఖీలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేటలో అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే బియ్యం అక్రమంగా నిల్వ చేసే వారిపై కఠినమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.