రాష్ట్రంలో కొత్త విద్యుత్ బస్సుల కొనుగోలులో ఆర్టీసీ తీవ్ర జాప్యం
రిపోర్టర్: అశోక్
స్థలం: విజయవాడ
రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగినా, కొత్త విద్యుత్ బస్సులను రోడ్డెక్కించడంలో సంస్థ తాపీగా అడుగులు వేస్తోందని అధికారులు తెలిపారు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చినా మౌలిక వసతుల కల్పనలో జరుగుతున్న జాప్యం వల్ల ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వారు పేర్కొన్నారు. డీజిల్ బస్సుల స్థానంలో ఏసీ విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ, ఆచరణలో మాత్రం తీవ్ర ఆలస్యం జరుగుతోందని స్పష్టమైంది.