చెన్నైలో దారుణం: వివాహేతర సంబంధం నేపథ్యంలో యువకుడి హత్య
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: చెన్నై
వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రశాంత్ అనే యువకుడిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కడలూరు జిల్లా సిరువత్తూరుకు చెందిన ప్రశాంత్ చెన్నైకి వెళ్లగా, అతడు నటి రాధికా శరత్‌కుమార్ ఇంట్ లో పనిచేస్తున్న ఎళిశెల్వి కుమారుడు అని తేలింది. వివాహేతర సంబంధం కారణంగా వేదరాసు, దినేష్ తో కలిసి ప్రశాంత్‌ను పొన్నేరి సమీపంలో హత్య చేసి పూడ్చిపెట్టినట్లు విచారణలో బయటపడింది. దీంతో పోలీసులు నిందితులను అరెస్టు చేసి, శనివారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టానికి తరలించారు.