హైదరాబాద్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సినీ నటులు చిరంజీవి, రామ్ చరణ్ భేటీ
రిపోర్టర్: రాము
స్థలం: Hyderabad
హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రముఖ సినీ నటులు చిరంజీవి, రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం బేగంపేటలోని కాకతీయ హోటల్ లో ఈ సమావేశం జరిగింది. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, పలు అభివృద్ధి అంశాలపై వీరు చర్చించినట్లు సమాచారం. ఈ భేటీతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్ లో తీవ్ర ఆసక్తి నెలకొంది.