నకిలీ వార్తలతో కాంగ్రెస్ దిగజారుడు రాజకీయం: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ధ్వజం
రిపోర్టర్: అశోక్
స్థలం: విజయనగరం
నకిలీ వార్తలను సృష్టించి సమాజంలో గందరగోళం రేపడమే కాంగ్రెస్ పార్టీ నైజంగా మారిందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనపై కాంగ్రెస్ నేతలు ఉద్దేశపూర్వకంగా వీడియోను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. తక్షణమే ఆ తప్పుడు పోస్టును తొలగించి, దేశ ప్రజలకు జైరాం రమేష్ క్షమాపణ చెప్పాలని ఆయన సోమవారం డిమాండ్ చేశారు.