టాలీవుడ్ లో కలకలం: త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు సినీ వర్గాల్ లో తీవ్రంగా ప్రచారం జరుగుతోందని మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నెల ఐదవ తేదీన హైదరాబాద్ లో అత్యంత సన్నిహితుల మధ్య ఆయన నిశ్చితార్థం జరగనుందని, డిసెంబర్ పదవ తేదీన వివాహ వేడుక నిర్వహించనున్నట్లు సమాచారం అందింది. అయితే ఈ పెళ్లి వార్తలపై ఇప్పటివరకు మెగా కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.