గుస్సాడి నృత్యంతో దండారి ఉత్సవాలను హోరెత్తించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
ఉట్నూరు మండలంలోని పలు గ్రామాల్ లో నిర్వహించిన దండారి ఉత్సవాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని ఆదివాసీ కళాకారులతో కలిసి సంప్రదాయ గుస్సాడి నృత్యం చేశారు. మన సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఉత్సవాల ప్రోత్సాహకంగా పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. నీటిని వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.