మహబూబ్ నగర్ మోతీనగర్ లో బాధితులకు అండగా నిలవాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్

రిపోర్టర్: రమేష్ స్థలం: మహబూబ్ నగర్

మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని మోతీనగర్ వడ్డెర బస్తీలో అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిన గుడిసెను మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులను పరామర్శించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం కారణంగా సర్వస్వం కోల్పోయి రోడ్డున పడిన నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితులకు అన్నివిధాలా అండగా నిలవాలని స్థానిక అధికారులను కోరారు.