ఖైరతాబాద్ స్థానం ఖాళీగా ఉన్నట్లు రాష్ట్ర అసెంబ్లీ గెజిట్ విడుదల

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యదర్శి తిరుపతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. 2023లో బీఆర్ఎస్ నుంచి గెలిచి, 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యరిగా పోటీ చేసిన దానం నాగేందర్ పై ఫిరాయింపు పిటిషన్ల నేపథ్యంలో కోర్టు ఈ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించడంతో ఏప్రిల్ ఇరవై మూడో తేదీ నుంచే స్థానం ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.