తెలంగాణ ఉద్యోగులకు రెండు డీఏల విడుదలకు ప్రభుత్వం సానుకూలం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న డీఏల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సచివాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు చర్చలు జరిపారు. ఈ సమావేశంలో రెండు డీఏల విడుదలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇందులో ఒక డీఏ 3.64 శాతం, మరో డీఏ 2.74 శాతం చొప్పున ఉండనున్నట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే దీనిపై తుది నిర్ణయం కేబినెట్ ఆమోదం మరియు అధికారిక ఉత్తర్వుల తర్వాతే స్పష్టమవుతుంది.