గిన్నిస్ రికార్డు కోసం ఏకంగా వంద కిలోమీటర్లు పరిగెత్తిన బౌలర్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: World
ఇంగ్లాండ్కు చెందిన క్లబ్ క్రికెటర్ సామ్ బోడోవానో గిన్నిస్ రికార్డు కోసం వినూత్న ప్రయత్నం చేశాడు. లార్డ్స్ క్రికెట్ స్టేడియం నుంచి 14 గంటలపాటు నిరంతరంగా 100 కిలోమీటర్లు పరిగెత్తి వోకింగ్ వాలీ ఎండ్ గ్రౌండ్లో తన తండ్రికి బంతిని విసిరాడు. క్యాన్సర్ స్వచ్ఛంద సంస్థ కోసం నిధులు సేకరించేందుకు చేపట్టిన ఈ సాహసంపై గిన్నిస్ పరిశీలన కొనసాగుతోంది.