భారీ వర్షాల కారణంగా జిల్లాలో విద్యాసంస్థలకు నేడు సెలవు
రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్
స్థలం: కాకినాడ అర్బన్
జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఒకరోజు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. తుఫాన్ ప్రభావం అధికంగా ఉండటంతో బుధవారం కూడా సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.