తిరుమలలో అత్యాధునిక వాటర్ అండ్ ఫుడ్ ల్యాబ్: దేశానికే ఆదర్శమన్న అదనపు ఈవో
రిపోర్టర్: సునీల్
స్థలం: తిరుమల
తిరుమలలోని వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ల్యాబ్ లో జరిగిన ఆయుధపూజలో పాల్గొన్న ఆయన, ఎఫ్ఎస్ఎస్ఏఐ సహకారంతో కేవలం పదకొండు నెలల్లోనే ఈ అత్యాధునిక ప్రయోగశాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కొనుగోలు దశ నుంచే ఆహార పదార్థాలు, తాగునీటి నమూనాలను కఠినంగా పరీక్షించి భక్తులకు అత్యున్నత నాణ్యమైన ప్రసాదాలు అందిస్తున్నామని ఆయన తెలిపారు.