కేవలం రెండు వందల తొంభై రూపాయలకే జియోభారత్ ఫోన్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తెలంగాణ
రిలయన్స్ జియో పదేళ్ల వార్షికోత్సవం సందర్భంగా జియోభారత్ ఫోన్ను కేవలం రెండు వందల తొంభై రూపాయల ఎఫెక్టివ్ ధరకే అందిస్తున్నట్లు రిలయన్స్ జియో సంస్థ వెల్లడించింది. మొదట వెయ్యి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించి ఈ ఫోన్ కొనుగోలు చేయాలని, ఆరు నెలల ఉచిత రీఛార్జ్ ప్యాక్ పోను అసలు ధర ఇంతే పడుతుందని పేర్కొంది. ఈ పండుగ సీజన్ ఆఫర్ కింద యూజర్లకు నెలకు పద్నాలుగు జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ ఉచితంగా లభిస్తాయని తెలిపింది.