రాజాపేట: తల్లిదండ్రుల జ్ఞాపకార్థం శ్మశాన వాటికలో పద్దెనిమిది లక్షలతో షెడ్డు నిర్మాణం

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని పురగిరి క్షత్రియ కులస్తుల స్మశాన వాటికలో సైంటిస్ట్ అంకతి రాజు తమ తల్లిదండ్రులు అంకతి పెద్ద నరసయ్య లక్ష్మి జ్ఞాపకార్థం పద్దెనిమిది లక్షల రూపాయల వ్యయంతో ప్రత్యేక షెడ్డు, స్నానపు గదులు నిర్మించారు. ఆదివారం జరిగిన ప్రారంభోత్సవ వేడుకలో దాతను కులస్తులు ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సౌకర్యాలు స్థానికులకు ఎంతో ఉపయోగపడతాయని పెద్దలు కొనియాడారు.