గుంతలమయంగా మారిన రోడ్లతో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు
రిపోర్టర్: సతీష్
స్థలం: కలువాయి
కలువాయి మండలంలోని పలు రహదారులు పూర్తిగా అధ్వానంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాచూరు-కమ్మపాలెం మధ్య మార్గంతోపాటు కొలపనాయుడుపల్లి నుంచి దాచూరు, ముక్కుతిప్ప వరకు రోడ్లు గుంతలమయంగా తయారయ్యాయి. చిన్నపాటి వర్షానికే ఇవి బురదమయంగా మారుతుండటంతో ప్రయాణం నరకప్రాయంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి దెబ్బతిన్న రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.